నాటు కోళ్ల పెంపకం ద్వారా నెలకు లక్ష రూపాయలు సంపదించుకునే మంచి సలహా!
నాటు కోళ్ల పెంపకంలో మనం ఎంత కష్టమైన చేయగలము అనే నమ్మకం మనలో ఉండాలి అప్పుడే మనం నాటు కోళ్ల పెంపకంలో కచ్చితంగా లాభాలను సృష్టించుకోగలము.ఇందుకు కావాలసిన భూమ పెట్టుబడి మరియు వీటని పెంచే విధానం వచ్చే లాభాల గురించి మాట్లాడుకుందాం.

1:- ఒక ఎకరం భూమి 10 లక్షల పెట్టుబడి ఇద్దరు కష్టపడే మంచి వ్యక్తులు మరియు నీళ్ల వసతి కూడా వుండాలి.
2:- షేడ్ నిర్మాణానికి సాధ్యమైనంత వరకు ఎంత తక్కువ ఖర్చుతో నిర్మించుకుంటె మనకు అంత మంచిది, 100 రేకులకు ఒక షేడ్ చొప్పున ఇలా రెండు షెడ్లు ఒక్కో షేడ్ ను మూడు భాగాలుగా ఇలా ఆరు భాగాలుగా నిర్మించుకోవాలి ఎకరం భూమి చూట్టూ (12 feet's) ఖనిలతో చుట్టూ జాలి కట్టుకోవాలి .
3:- నాటు కోడి పిల్లలు మార్కెట్ నుండి తీసుకొచ్చే ముందు షేడ్ కు కావాలసిన జాగ్రత్తలు తీసుకొని మొదటి నెల (650) పిల్లలు ఇలా ప్రతి నెల (650) కోడి పిల్లలను తెచ్చుకోవాలి మనం మొదటి నెల తెచ్చిన పిల్లలు ఆరు నెలకు (1.5) కీలో, కిలోనర బరువుకు వస్తాయి వీటిని నెల రోజులలో అమ్ముకునే ప్రయత్నం చేయాలి
4:-నాటు కోళ్లను పెంచే విధానం షేడ్ ముందు వున్న భూమిని గడ్డి మొలిచే విదంగా కొంచెం తడిగా ఉంచాలి అందులో నుండి 50% ఆహారం, మనం దాన ద్వారా 50% ఇవ్వాలి అప్పుడు కోళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయి.
5:- మనం కోడి పిల్లలు తీసుకువచ్చిన తరువాత షేడ్ లొని ఒక భాగంలో నెల రోజుల వరకు బయటకు వదలకుండా మనమే దాన నీళ్ళు పోసుకోంటు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మనం 650 కోడి పిల్లల తెచ్చుకుంటే యబై చనిపోయిన 600 మనం లెక్క వేసుకోవాలి.
6:- ఇక్కడ మనం ఖర్చు లాభాల గురించి లేక్కాలు వేసుకోందాం.
7:- ఒక్కో నాటు కోడి పిల్ల ఖరీదు 18 నుండి 30 వరకు రెటు ఉంటుంది మనం ప్రతి నెల 650 పిల్లలు తీసుకువస్తే మనం 30 చొప్పున అయిన మనకు 19500 ఖర్చు అవుతుంది

8:- మనం షేడ్ గురించి ఎంత తక్కువ ఖర్చుతో వేసుకుంటే అంత మంచిది, 6 లక్షలు మరియు లక్ష రూపాయలు ఖనిలు జాలి దాన మరియు మందుల ఖర్చు రోజుకు1200 వందల చొప్పున వేసుకుందాం.
9 :- మొత్తం మనం పెట్టె పెట్టుబడి
షేడ్ కోరకు:- 600000
చుట్టూ జాలి:- 100000
కోడి పిల్లలకు:- 120000
దాన మందులకు:- 216000
మొత్తం పెట్టుబడి:- 1016000.
10 :-ప్రతి నెల మనకు అయే ఖర్చు
కోడ్ పిల్లలకు :- 19500
దాన మందులకు:- 36000
11:- ప్రతి నెల మనకు వచ్చే ఆదాయం
కిలో కు 200 అయిన ప్రతి కోడికి 300 రూపాయలు
అంటే 600 కోళ్ళకు 180000
ప్రజలు నెల వచ్చే ఆదాయం 180000
ప్రతి నెల కోళ్ళకు పెట్టె ఖర్చు 55500
ఖర్చులు పోగా మిగిలే డబ్బు 124500
12:- ఈ యొక్క ప్లాన్ మొత్తం నాటు కోళ్ళు పెంపకం చేద్దామని వారం రోజుల నుండి అలోచించాను.
13:-ఇందులో మీకు ఎదైన అలోచన ఉంటే మీ యొక్క సలహా కామెంట్ రూపంలో తెలుపగలరు.
మీ యొక్క రైతు సోదరుడు .🙏🙏🙏🙏🙏
Post a Comment